Monday, December 23, 2024

స్కూటీని ఢీకొట్టి 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం ఆరంభం ఆదివారం ఉదయం ఘోరమైన ఘటన జరిగింది. స్కూటీపై వెళ్లుతున్న 20 ఏళ్ల అంజలి అనే యువతిని ఓ కారు ఢీకోని ఆమెను 4 కిలోమీటర్ల మేర వేగంగా ఈడ్చుకుంటూ వెళ్లిన దశలో దారుణరీతిలో మృతి చెందింది. ఆమెను కారుతో ఢీకొని దారుణంగా చంపివేశారని, లైంగిక అత్యాచారం కూడా జరిగిందని, తమకు న్యాయం కావాలని ఈ యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన ఘటన గురించి పోలీసులు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మారుతీ సుజుకీ బలెనోలో వెళ్లుతుండగా స్కూటీని ఢీకొంది. కారులోని ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒక్కరు క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంటు కూడా ఉన్నారు. డ్రైవర్, రేషన్ షాప్ ఓనరు కూడా అరెస్టు అయిన వారిలో ఉన్నారని పోలీసు అధికారి వివరించారు.

ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో స్కూటీని కారు ఢీకొన్న తరువాత ఆమె చాలా దూరం వరకూ కారు కింద ఇరుక్కుని పోయింది. ఈ దశలో కాళ్లు చేతులు విరిగాయి. తన కూతురిపై ఈ కారులోని వారు అత్యాచారం చేసి ఉంటారని, ఆమె దుస్తులు పూర్తిగా చిరిగిపోయి పూర్తిగా నగ్నంగా పడి ఉండగా తమకు నెత్తుటి మడుగులో కన్పించిందని తల్లి రేఖ తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరారు.

ఇప్పుడు జరిగింది ఢిల్లీలో మరో నిర్భయ ఘట్టం అని, దుండగులు అంజలిపై లైంగికంగా దాడిచేసి ప్రమాదంగా చిత్రీకరించి చంపివేసి ఉంటారని మేనమామప్రేమ్‌సింగ్ తెలిపారు. అరెస్టు అయిన వారు స్కూటీ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. అయితే కారు కింద మనిషి ఉన్నట్లు తమకు తెలియదని పోలీసులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News