గాంధీనగర్: బైక్‌ను కారు ఢీకొట్టి అనంతరం కారు అతడిని 12 కిలో మీటర్లు లాకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు 40 రోజుల తరువాత మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో జరిగింది. బిరెన్ లాడమోర్ అనే వ్యక్తి బిల్డర్ వ్యాపారం చేస్తూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 18న తన కారులో సూరత్‌లోని కామ్రేజ్ టోల్‌ప్లాజా నుంచి బయటకు వెళ్తున్నాడు. అదే సమయంలో సాగర్ అనే వ్యక్తి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. బైక్‌ను వెనక నుంచి కారును ఢీకొట్టడంతో సాగర్ కారు కిందకు వెళ్లిపోయాడు. భయంతో బిరెన్ కారు 12 కిలో మీటర్లు తీసుకెళ్లాడు. 12 కిలో మీటర్లు కారు కింద ఇరుక్కొని సాగర్ ఉండడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత 40 రోజుల నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్‌పి హితేష్ జోయ్‌సర్, డిఎస్‌పి ఎస్‌ఎన్ రాథోడ్ తెలిపారు. బిరెన్ గుజరాత్ నుంచి మహారాష్ట్రకు వెళ్లాడు, అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఢీకొట్టిన కారు… 12 కిలో మీటర్లు లాక్కెళ్లి…. 40 రోజుల తరువాత మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -