Saturday, September 21, 2024

సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టి… ఇంటికెళ్లి పడుకుంది

- Advertisement -
- Advertisement -

Car driven runs over watchman by teenager

చెన్నై: అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డు ను ఓ యువతి కారుతో ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చెన్నైలో జరిగింది. యువతి మాత్రం ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నార్త్ లేయిత్ క్యాస్టిల్ వీధిలో శివ ప్రకాశమ్ (68) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అపర్ణ (18) అనే అమ్మాయి తన కారును సెక్యూరిటీ గార్డును ఢీకొట్టి ఇంటికి వెళ్లి నిద్రపోయింది. సెక్యూరిటీ గార్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కారు చక్రానికి సెక్యూరిటీ గార్డు బెడ్ షీట్ చుట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 304ఎ, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి యువతిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News