Saturday, November 23, 2024

రూ.55లక్షలతో డ్రైవర్ పరారీ

- Advertisement -
- Advertisement -

Car Driver absconded with Rs 55 lakh

కోకాపేటలోని భూమియజమానికి ఇవ్వమని పంపించిన యజమాని
కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు పట్టుకొని పరారైన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని జూబ్లీహిల్స్‌కు చెందిన సంతోష్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి వద్ద కృష్ణా జిల్లాకు చెంది శ్రీనివాస్ ఆరు నెలల క్రితం కారు డ్రైవర్‌గా చేరాడు. ఇటీవల సంతోష్ రెడ్డి భూమిని కొనుగోలు చేశాడు. భూమి యజమాని కోకాపేటలో ఉంటుండడంతో డ్రైవర్‌కు రూ.55లక్షలు ఇచ్చి మధ్యాహ్నం భూమి యజమానికి ఇచ్చిరావాల్సిందిగా కారులో పంపించాడు. ఇదే అవకాశం అని భావించిన నిందితుడు కారులో బయలు దేరిన డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డు నంబర్ 10లో బెంజ్ కారు వదిలేసి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. డ్రైవర్ డబ్బులతో రాకపోయేసరికి భూమి యజమాని సంతోష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే రియల్టర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News