Thursday, December 5, 2024

కార్ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిధిలో ఆదివారం అమేజాన్ బిల్డింగ్ సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు గుర్తించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడిని కిందకు దించి అనంతరం అతని వద్ద గల ఐడెంటిటీ ప్రకారం మృతుడు హర్యానా రాష్ట్రానికి చెందిన పర్వేజ్ (22) గా గుర్తించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఎయిర్ పోర్ట్ లోని అమేజాన్ కంపనీలో టెంపర్వరి డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తోటి స్నేహితులతో అడిగి తెలుసు కుంటున్నారు. కేసు నమోదు చేసిన ఎ యిర్ పోర్ట్ పోలీసు లు మృతదేహాన్ని పో స్టుమార్టం ని మి త్తం ఉస్మానియా మా ర్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News