Thursday, January 23, 2025

కదులుతున్న కారులో డ్రైవర్‌కు గుండెపోటు… కారును ఆపిన సిఐ.. సిపిఆర్ చేసి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: కారు డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో సిఐ అప్రమత్తమై కారును ఆపాడు. వెంటనే సదరు డ్రైవర్‌కు సిపిఆర్ చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినప్పటికి డ్రైవర్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కావలి శ్రీనివాస్ అనే వ్యక్తి కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కారులో ఓ కుటుంబాన్ని యాదగిరి గుట్టకు తీసుకెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు దాటి ముందుకు వెళ్తుండగా శ్రీనుకు గుండె నొప్పి రావడంతో ఒకవైపు ఒరిగాడు. వెంటనే కారులో ఉన్న ప్రయాణికురాలు స్టీరింగ్ నియంత్రించేందుకు ప్రయత్నించింది… కారు నెమ్మది కావడంతో అటు ఇటు కదలడంతో రామన్నపేట సిఐ మోతీరామ్ గమనించి వెంటనే కారును ఆపాడు. వెంటనే శ్రీనుకు సిపిఆర్ చేసి అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News