Friday, November 22, 2024

రెడ్ సీలో హౌతీ దాడులతో సంక్షోభం !

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బెల్జియం, జర్మనీ దేశాలలో కార్ల ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు నిలచిపోయాయి. పాపులర్ బ్రిటిష్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో స్ప్రింగ్ ఫ్యాషన్ లైన్‌లు ఆలస్యం అవుతున్నాయి. ఇక ఆసుపత్రులకు వైద్య ఉత్పత్తులు సరఫరా చేసే అమెరికాలోని మేరీలాండ్ సంస్థకు ఆసియా నుంచి విడిభాగాలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ప్రపంచ వాణిజ్యానికి మరొక షాక్ ఇస్తోంది. కొవిడ్ అనంతర సమస్యలతో రేవులలో ఇబ్బందులు, ఉక్రెయిన్‌లో రష్యా దాడుల నేపథ్యంలో ఆ పరిస్థితి తలెత్తింది. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఐరోపా, అమెరికాతో ఆసియాను అనుసంధానించే జలాలలో తిరిగి సరకుల రవాణా నౌకలపై దాడులు సాగిస్తున్నారు.

పర్యవసానంగా ఆ మార్గంలో నౌకల రవాణాను సూయజ్ కాలువ నుంచి, దక్షిణాఫ్రికా దక్షిణ కొన మీదుగా సాగించవలసి వస్తోంది. ఆ అంతరాయం వల్ల సరకుల రవాణా ఆలస్యం అవుతోంది. ఖర్చులూ పెరుగుతున్నాయి.ద్రవ్యోల్బణం పునరుద్ధరణను ప్రపంచం ఇంకా నిలువరించలేకపోతున్న తరుణంలో ఆ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘ఇప్పుడు సంభవించింది స్వల్ప కాల సంక్షోభం. సంక్షోభం ఖర్చుల పెరుగుదలకు దారి తీస్తున్నది’ అని సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ సంస్థ ఫ్లెక్స్‌పోర్ట్ సిఇఒ ర్యాన్ పీటర్సన్ వెల్లడించారు. ‘మార్గం మళ్లించిన ప్రతి నౌకలో పది వేల కంటైనర్లు ఉన్నాయి. ఆ కంటైనర్ ప్రయాణాలు ఒక్కొక్కదానిపై తిరిగి ప్రణాళిక వేయడానికి ఎన్నో ఇ=మెయిల్స్, ఫోన్ కాల్స్ అవసరం అవుతున్నాయి’ అని పీటర్సన్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య నౌకల రవాణాలో ప్రతిష్టంభన దెబ్బ మీద దెబ్బగా ఉంటున్నదని పీటర్సన్ వ్యాఖ్యానించారు.

మరొక కీలక వాణిజ్య కారిడార్ = పనామా కాలువ మీదుగా రవానాను నీటి మట్టాలు తక్కువగా ఉండడం వల్ల పరిమితం చేయవలసి వస్తోంది. దుర్భిక్ష స్థితి వల్ల ఆ కాలువలో నీటి మట్టాలు తగ్గాయి. అంతే కాదు,. ఫిబ్రవరి 10=17 లూనార్ నూతన సంవత్సరం సెలవుల కోసం చైనీయుల ఫ్యాక్టరీలను మూసివేసే లోపే సరకులను రవాణా చేయాలని షిపర్లు హడావుడి పడుతున్నారు. గాజాలో పోరు వల్ల సరకుల నౌకల రవాణాకు ముప్పు మరింత ముదురుతోంది. సరకుల ద్రవ్యోల్బణం రెండు శాతం పెరిగిందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News