Friday, December 20, 2024

అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి,

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : కారు అదుపు తప్పి చెరువులోకి వెళ్లిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డి పేట్ చెరువు దగ్గర సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి కారులో మాదాల మోహన్, రఘు కోమర, సాగర్ కొమర, పూజిత, గుణశేఖర్ కలిసి అనంతగిరి గుట్టను చూడడానికి వస్తున్నారు. దారిలో శివారెడ్డిపేట చెరువు దగ్గరలోకి రాగానే కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు.

రెస్క్యూ టీంలు, ప్రత్యేక బృందాలతో 11 గంటలు వెతకగా గుణశేఖర్ (24) మృతదేహాన్ని కారు గుర్తించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. హైదరాబాద్‌లో ప్రవేట్ ఉద్యోగం చేసుకొని జీవిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమంలో కారును మోహన్ అనే వ్యక్తి నడిపినట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు సిఐ శ్రీను తెలిపారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
శివారెడ్డిపేట చెరువులో కారు దూసుకెళ్లి జరిగిన సంఘటన గురించి తెలుసుకొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షించి, పోలీసులతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News