Friday, November 22, 2024

జలపాతంలో పడిపోయిన కారు(షాకింగ్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: జలపాతం వద్ద నిలిపిఉన్న ఒక కారు నీటిలో పడిపోవడంతో కారులో ఉన్న ఒక తండ్రి, అతని 13 ఏళ్ల కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక ఎరుపు రంగు కారు జలపాతం ఉన్న ప్రాంతం నుంచి కింద నీటి మడుగులో దొర్లుకుంటూ పడిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. కారు డోరు తెరుచుకుని మళ్లీ మూతపడిపోగా రక్షించండి అంటూ ఒక బాలిక ఆర్తనాదాలు వినిపించాయి.
నీటి మడుగు ఒడ్డున ఉన్న ఒక యువకుడు ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెంది వెంటనే తేరుకుని నీటి మడుతులోకి దూకి ఈదుకుంటూ వెళ్లి కారులో ఉన్న ఒకరిని రక్షించాడు. అక్కడే ఉన్న మిగిలిన వారు కారులోని మరో వ్యక్తిని రక్షించారు.

పైనుంచి జలపాతంలో కారు పడిపోవడం తాను గమనించానని, అయితే ఏం చేయాలో తనకు ఓ క్షణం పాలుపోలేదని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల సుమీత్ మాథ్యూ తెలిపాడు. అయితే వెంటనే తాను నీటి మడుగులోకి దూకి ఈదుకుంటూ వెళ్లి కారులో చిక్కుకున్న ఒక 13 ఏళ్ల బాలికను కాపాడానని, కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని అతను చెప్పాడు.

కారు నడుపుతున్న వ్యక్తి నిర్లక్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్‌పి(గ్రామీణ) సునీల్ మెహతా తెలిపారు. జలపాతానికి అత్యంత సమీపంలో కారును పార్కు చేశారని, వర్షాలకు అక్కడ మట్టి కోసుకుని పోయి ఉండడంతో కారు అదుపు తప్పి నీటి గుంటలో పడిపోయిందని ఆయన చెప్పారు. షాకింగ్‌కు గురిచేసే ఈ వీడియోను మీరూ చూసెయ్యండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News