Monday, December 23, 2024

అఖిల ప్రియ బాడీగార్డును కారుతో ఢీకొట్టి….హత్యాయత్నం (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగంగా మారాయి. పల్నాడు. చంద్రగిరిలో టిడిపి-వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేసుకున్నారు. పల్నాడు, చంద్రగిరిలో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులకు తెగపడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్లదీశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ మరో వ్యక్తితో కలిసి అఖిల్ ప్రియ ఇంటి ముందు నిలబడ్డాడు. వేగంగా కారు దూసుకొచ్చి నిఖిల్‌ను ఢీకొట్టింది. నిఖిల్ 15 అడుగుల ఎత్తు లేచి కిందపడ్డాడు. కారులో నుంచి ముగ్గురు దిగి వేటకోడవళ్లతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించారు.

వాళ్ల నుంచి తప్పించుకొని అఖిల్ ప్రియా ఇంటిలోకి అతడు పరుగులు తీశాడు. వెంటనే ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నంద్యాలలో టిడిపి జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సుబ్బారెడ్డి అనుచరులు దాడి చేశారని నిఖిల్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో అఖిల ప్రియ, అటు టిడిపి నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవి సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసులు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News