Monday, January 20, 2025

సూర్యపేటలో బైక్ ను ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. జారిగూడ మండలం బొల్లంపల్లి సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News