Monday, April 7, 2025

పెద్దపల్లలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం సుల్తానాబాద్‌ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను గోదావరిఖనికి చెందిన అహ్మద్‌, ఎండీ గౌస్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News