సిటిబ్యూరోః కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కొత్తగా కొనుగోలు చేసిన కారులో యువతులు, ఓ యువకుడు కలిసి జాలీ ట్రిప్‌కు బయలు దేరారు. కారును అధిక వేగంగా నడపడంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అదుపు తప్పింది. దీంతో కారు వేగంగా వస్తుండడంతో అక్కడే ఉన్న వారు భయంతో పరుగులు తీశారు.
వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ఫిల్మ్‌నగర్ వైపు నుంచి చెక్‌పోస్టు వైపు వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65కు వెళ్లే దారిలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అందులో నుంచి దిగిన యువతులు కారు దిగి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకున్నారు. కారును క్రేన్ సాయంతో తీసుకుని వెళ్లారు.
టైరు పగలడంతో ప్రమాదంః రాజశేఖర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్
జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 65లో కారు టైరు పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టిందని జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. టైర్‌పగలడంతో కారు అదుపు తప్పిందని, దీంతో డివైడర్‌ను ఢీకొట్టిందని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయలేదని తెలిపారు. కారు లోపల మహిళలు ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. కేసు నమోదు చేయలేదని తెలిపారు.