Sunday, January 19, 2025

రోడ్డు ఊడుస్తున్న కార్మికురాలిని ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. రోడ్డు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని కళమ్మగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News