Thursday, April 3, 2025

అతివేగంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: కారు అతివేగంగా రాంగ్ రూట్లో వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమిత్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అవధ్ ప్రాంతంలో కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఓ కారు రాంగ్‌రూట్లో అతి వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సిసి టివి కెమెరాల్లో రికార్డు కావడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కారు నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News