Thursday, December 12, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో సంఘటనాస్థలంలోనే నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్‌, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News