Friday, December 20, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నార్సింగిః  మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం శివారు ఎన్‌హెచ్ 44 అడవి ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు నిజామాబాద్ జిల్లా నుంచి గజ్వేల్ కు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఆటలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మృతులంతా నిజామాబాద్ జిల్లా ఆలూరు వారిగా పోలీసులు నిర్దారించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 6 మంది ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇప్ప శేఖర్(45) తండ్రి బాలయ్య, ఇప్ప యశ్వంతత్(09)తండ్రి శేఖర్, గుంటకు బాలనర్సయ్య(70), గుంటకు మానెమ్మ(62)నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News