Wednesday, December 18, 2024

నార్సింగ్ లో ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లాలోని నార్సింగ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం  ఉదయం మండలంలోని మల్లూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో కామారెడ్డి నుంచి చేగుంట వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు శేఖర్(45),యశ్వంత్(9), బాలనర్సయ్య(70), మణెమ్మ(62) నిజామాబాద్ లోని ఆర్మూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News