Tuesday, January 21, 2025

ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్ ను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్ ను కారు ఢీకొట్టడంతో డ్రైవర్ కారులో నుంచి బయటపడ్డాడు. దీంతో డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నిలయ రెడ్డిగా గుర్తించారు. ఎల్ వి ప్రసాద్ ఐ ఆసుపత్రి లో డాక్టర్ గా పని చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే చాలు కారు వందకు పైగా వేగంతో ప్రయాణిస్తుండడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. మితిమీరిన వేగం ప్రాణాలకే ప్రమాదం అని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News