Sunday, December 22, 2024

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు

- Advertisement -
- Advertisement -

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్ తొక్కడంతో ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో పండ్ల వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం…. ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న రోహిత్ రోజు మాదిరిగానే ఆస్పత్రికి వెళ్లి తిరిగి ఇంటికి రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వెళ్తుండగా లంగర్ హౌస్ బాపు ఘాట్ తపోవనం వద్ద కారు బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్ తొక్కాడు. దీంతో కారు ఒక్కసారిగా ఫుట్ పాత్ పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న వారిపైకి దూసుకు వెళ్ళింది.

ఫుట్‌పాత్‌పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న తరుణ్ (20), తౌఫిక్ (28), సోహెల్ (35)కు గాయాలయ్యాయి. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన సోహెల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న లంగర్ హౌస్ పోలీసులు తోపాటు ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న కారును పోలీసులు అక్కడి నుంచి తొలగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రఘు కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News