Wednesday, January 22, 2025

హుజూరాబాద్ లో కారు బీభత్సం.. మున్సిపల్ కార్మికురాలి మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజూరాబాద్ శివారు సైదాపూర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఇద్దరు మున్సిపల్ కార్మికులను ఢీకొట్టింది. కార్మికులతోపాటు మరో ద్విచక్రవాహనంపైకి కారు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మున్సిపల్ కార్మికురాలు సమ్మక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో కార్మికురాలు, ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News