- Advertisement -
మహేశ్వరం తుక్కుగూడ సమీపంలోని రావిరాల గ్రామం దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13పై ఘోర రోర్డు ప్రమాదం జరిగింది. ఔటర్ పై మొక్కలకు నీరు పోస్తున్న నీళ్ల ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వాటర్ మెన్ రాములు , కారులో పక్కన కూర్చున్న రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వ్యక్తులు నాగర్‌కర్నూల్‌కి, వాటర్ మెన్ కొంగరాకాలన్‌కి చెందిన వారుగా గుర్తించారు. వాటర్ ట్యాంకర్ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అదిబట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. అదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఫొటోలు : తుక్కుగూడ1,2,3
- Advertisement -