Sunday, December 22, 2024

నల్లకుంటలో హిట్ అండ్ రన్

- Advertisement -
- Advertisement -

మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో ఓ వ్యక్తి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం…నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఈనెల 18వ తేదీన కారు నంబర్ టిఎస్ 09ఎఫ్‌జే 0574 హుందాయల్ ఐ20లో మద్యం తాగి వేగంగా గల్లీ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి అతివేగంగా రావడంతో బైక్ వెళ్తున్న అంబర్‌పేకు చెందిన ప్రవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు యాడవల్లి శ్రీనివాస్ సితా రమేష్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు.

వెంటనే స్థానికులు కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని ఆపి కారు డోర్ తెరవడంతో మద్యం బాటిల్ లభించింది. కారు వేగం వెళ్లి రోడ్డు ప్రమాదం చేసిన విషయం మొత్తాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. హిట్ అండ్ రన్ కేసులో గాపడిన శ్రీనివాస్ సితారమేష్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కారుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాసి ఉంది. కారు నంబర్‌తో ఎలాంటి వివరాలు ఆన్‌లైన్‌లో రావడంలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, కారు ఓ ఐఎఎస్ అధికారిదిగా తెలుస్తోందని చెప్పారు. ఎవరు డ్రైవింగ్ చేసారనే విషయం తెలియాల్సి ఉందని ఎస్సై రమాదేవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News