- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది.శనివారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా… మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో కారులో ఉన్నవారు.. వెహికిల్ ను అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బంజారాహిల్స్ పోలీసులు.
- Advertisement -