Monday, December 23, 2024

కెపిహెచ్‌బిలో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫోరం మాల్ సర్కిల్‌లో సోమవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి నగరంలోని ఓ పాబ్‌లో పార్టీ చేసుకున్నాడు. కారు డ్రైవర్ నడుపుతుండగా అతడిని పక్కకు తప్పించి అగ్రజ్ రెడ్డి కారు డ్రైవింగ్ చేశాడు.

మద్యం మత్తులో ఉన్న అగ్రజ్ రెడ్డి కారును రాంగ్ రూట్‌లో నడపడమే కాకుండా రాష్ డ్రైవింగ్ చేయడంతో బైక్ వచ్చిన వారిని ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఢీకొట్టాడు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేపట్టారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్బులో పార్టీ చేసుకుని కారులో జీడిమెట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉండటమే రోడ్డుప్రమాదానికి కారణమని చెప్పారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డికి కెపిహెచ్‌బి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అగ్రజ్‌రెడ్డి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. విచారణకు సహకరించాల్సిందిగా అగ్రజ్‌రెడ్డికి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News