Thursday, December 19, 2024

సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం.. మూడు ఫల్టీలు కొట్టిన కారు(వీడియో)

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద గురువారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మూడు పల్టీలు కోట్టింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సికింద్రాబాద్ క్లబ్ సర్కిల్ సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఎస్ యూవీ కారు.. సిగ్నిల్ పడుతుందనే తొందర్ లో అంతే వేగంగా కారును డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో మరోవైపు నుంచి వస్తున్న కారు.. ఎస్ యూవీ కారుకు అడ్డుగా రావడంతో రెండు ఢీకొన్నాయి. దీంతో ఎస్ యూవి కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది.

ఈ ఘటనలో పల్లీలు కొట్టిన కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకని పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News