Monday, December 23, 2024

కారు బోల్తా : మహిళ మృతి

- Advertisement -
- Advertisement -
  • ఐదుగురికి తీవ్ర గాయాలు
  • ప్రమాదంలో ఆమనగల్లు ఎంపిపి అనిత అత్త మృతి
  • బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ

ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు మం డలం చింతపల్లి గ్రామ సమీపంలోని తలకొండపల్లిఆమనగల్లు ప్రధాన రహదారిపై గురువారం సాయ ంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎసై సుందరయ్య తెలిపిన కథనం ప్రకారం ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఎంపీపీ అనిత బావ నేనావత్ పాండు కూతురు ఎంగేజ్‌మెంట్ తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం జరిగింది. వేడుకల అనంతరం ఎంపిపి అనిత మరిది నేనావత్ రవి కుటుంబసభ్యులు నేనావత్ ముత్యాలి, ఎంపిపి కూతురు సహరా, కుటుంబ సభ్యులు అనిత, అపూర్వ, అర్చనలను తీసుకోని కారులో మేడిగడ్డకు బయలుదేరాడు. చింతలపల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఎంపీపీ అత్త ము త్యాలి అక్కడిక్కడే మృతి చెందగా మరో 5 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం వెల్దండ సమీపంలోని యెన్నం ఆసుపత్రికి తరలించినట్లు ఎసై తెలిపారు.సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసుపత్రికి చేరుకోని గాయపడిన వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News