Friday, January 24, 2025

వికటించిన స్టంట్: కారు కింద పడి ఐదుగురికి గాయాలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఓ యువతి కారుతో స్టంట్లు చేద్దామనుకుని, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమెతోపాటు మరో నలుగురు కారు కింద నలిగిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెరికాలోని కొలరాడోలో జరిగిన ఈ సంఘటన వాహనాలతో స్టంట్లు చేసేవారికి కనువిప్పు. కొలరాడో స్ప్రింగ్స్ లో ఒక మాల్ ఎదుట పార్కింగ్ ప్లేస్ లో ఒక యువతి కారుతో విన్యాసాలు చేద్దామనుకుంది. ఆమె స్నేహితులు కారు డోర్లపై నిల్చుండగా, ఆ యువతి వేగంగా రివర్స్ చేసింది. దాంతో అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. డోర్లు పట్టుకుని నిలబడిన ఆమె స్నేహితులు కారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. యువతి మాత్రం స్వల్ప గాయాలతో తప్పించుకుంది. పోలీసులు ఆ యువతిని అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News