తండ్రి, కూతురు, కుమారుడి దుర్మరణం
ప్రాణాలతో బయటపడ్డ భార్య మార్గంమధ్యలో
ప్రవీణ్‌కు గుండెపోటు కారు వెనక్కి
మళ్లిస్తుండగా అదుపుతప్పి కాలువలోకి
మన తెలంగాణ/ పర్వతగిరి: వరంగల్ జిల్లా, సంగెం మండలం, తీగరాజుపల్లి వద్ద ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెం దిన తండ్రి, కు మార్తె, కుమారుడు మృతి చెందారు. తల్లి ప్రాణాలతో బయటపడింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండ లం, మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్రసాయి, కుమారుడు ఆర్యవర్ధ్దన్ సాయితో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుం డె నొప్పి ఎక్కువై కారు అదు పు తప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలో పడింది. స్థానికుల సా యంతో కృష్ణవేణి బయటపడింది. కుమారుడు మృతి చెం దగా కారుతో సహా ప్రవీణ్, చైత్రసాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నీటిని అదుపులోకి తీసుకొచ్చి కారు, ప్రవీణ్, అతని కుమార్తె ఆచూ కీ కనుక్కొనేందుకు సిఐ రాజగోపాల్, ఎస్‌ఐ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ఉన్నతాధికారులతో మాట్లాడి నీటిని వేరే కెనాల్‌కు మళ్లించి గేట్లు వేసి వేశారు. అనంతరం కొద్దిదూరంలో కాలువలో కారు కనిపించ గా జెసిబి సాయంతో కారును బయటకి తీశా రు. అందులో తండ్రి, కుమార్తె మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించారు.