Sunday, December 22, 2024

ఎస్ఆర్ఎస్పి కెనాల్ లో పడ్డ కారు: యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల:  కారు  అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్ లో పడడం తో యువకుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల పట్టణ శివారు ప్రాంతం ధరూర్ క్యాంపు సమీపంలో చోటు చేసుకుంది.  వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన ఐదుగురు యువకులు చల్గల్ బైపాస్ నుండి అంతర్గాం మీదుగా జగిత్యాల వస్తున్న క్రమంలో ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో కారు అదుపు తప్పి పడిపోయింది.

దీంతో డ్రైవింగ్ చేస్తున్నబీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే యువకుడు కారులోనే చిక్కుకుపోగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అతడికి సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. రిజ్వాన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో మృత్యువాత పడినట్లు సమాచారం. కాగా రిజ్వాన్ వృత్తి రీత్యా జర్నలిస్టు అని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న మిగతా యువకులు స్వల్ప గాయలతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News