Saturday, December 21, 2024

నార్సింగిలో కార్ల రేసింగ్

- Advertisement -
- Advertisement -

ఆరుగురు బడాబాబుల పిల్లల అరెస్టు

మనతెలంగాణ, సిటిబ్యూరో: నగర శివారులో బడాబాబుల పిల్లలరు ఖరీదైన కార్లలో రేసింగ్‌లో పాల్గొంటు రచ్చరచ్చ చేస్తున్నారు. భయాందోళనకు గురైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ శివకుమార్ కథనం ప్రకారం…నార్సింగి పోలీస్ స్టేషన్ ఫరిధిలోని కోకాపేట సమీపంలోని మూవీటవర్స్ వద్ద కార్ రేసింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం డయల్ 100 ద్వారా వచ్చింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లను సీజ్ చేశారు. కార్ రేస్‌లో పాల్గొంటున్న సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన యువకులు బడాబాబుల పిల్లలు కావడంతో వదిలివేయాలని పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News