Tuesday, April 29, 2025

కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టునాయుడుపేట జాతీయ రహదారిపై వేంగంగా వెళ్తున్న ఓ కారు ముందునున్న కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో ఐదు గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరు కుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. అలాగే, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తు లు కారులో తిరుమలకు బయలు దేరారు. అయితే పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీట్టిం ది. ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలం లోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధురాలు, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూ డా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరికి స్థానిక ఆస్ప త్రిలో చికిత్స జరుగుతోంది.

కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెం టనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో వెంటనే దానిని బయటకు తీశారు. కానీ అప్ప టికే కారులో ఉన్నవారు చనిపోయినట్లు ధృవీకరించారు. అలాగే పోలీసు లు అక్కడకు చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు, ఒక బాలుడు ఉన్నా రు. విషయం తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన మహిళ గీతమ్మ, బాలుడు క్రీస్వీన్‌లకు రుయాలో ప్రథమ చికిత్స చేశారు. బాధితులు అందరూ తమిళనాడు లోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News