- Advertisement -
సోలన్(హిమాచల్ ప్రదేశ్): ధరంపూర్‌లోని పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి ఒక ఇన్నోవా కారు దూసుకెళ్లగా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.
అతి వేగంతో వెళుతున్న ఇన్నోవా కారు పాదచారులను వెనుక నుంచి ఢీకొని వారిపైనుంచి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని వారు చెప్పారు. మృతులంతా కార్మికులని, వారిలో కొందరు కారు ఢీకొన్న దరిమిలా పక్కనే ఉన్న గోతిలో పడిపోయారని, కొందరు రోడ్డుపైనే స్పృహతప్పిపోయారని వారు వివరించారు.
- Advertisement -