Wednesday, January 22, 2025

జర్మనీ క్రిస్మస్ మార్కెట్ లోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తూర్పు జర్మనీ లోని మాగ్డేబర్గ్ నగరంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మార్డేబర్గ్ లోని క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఓ చిన్నారితోసహా ఐదుగురు మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. కారు దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన తలేబ్(50)ను జర్మనీ పోలీస్‌లు అరెస్టు చేశారు. నిందితుడు తలేబ్ సౌదీ డాక్టర్. 2006లో జర్మనీకి వలస వెళ్లాడు. ఆయన మాడ్గేబర్గ్‌కు దక్షిణంగా 40 కిమీ దూరంలో ఉన్న బెన్‌బర్గ్‌లో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని, విదేశీ వ్యవహారాల మంత్రి తమర జెయిస్కాంగ్ చెప్పారు.

నిందితుడు బీఎమ్‌డబ్లు కారును అద్దెకు తీసుకొని నడిపినట్టు తెలిపారు. ఈ సంఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సౌదీఅరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ సైతం ఈ సంఘటనపై స్పందించింది. ‘జర్మనీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అని ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఎనిమిదేళ్ల క్రితం బెర్లి లోని అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్ లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఆ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ట్యునీసియా శరణార్థి కారణమని గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News