- Advertisement -
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. లారీ కిందకు దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -