Wednesday, April 2, 2025

గుడికి వెళ్లి వస్తుండగా ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఏడుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్‌కాంత జిల్లాలోని హిమత్‌నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జ అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) విజయ్ పటేల్ తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుకున్న మృతదేహాలను కట్టర్‌ను ఉపయోగించి బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News