Monday, January 20, 2025

వాహన షోరూంలలో కనిపించని వాహనాల ధరల పట్టిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో:  సాధారణ టిఫిన్ సెంటర్ల నుంచి రైతు బజార్లో అమ్మే కూరగాయల ధరల వరకు ప్రత్యేక బోర్డులను(ధరల పట్టిక) ఏర్పాటు చేసి ఫలాన ఇడ్లీ ధర, ఇంత, ఫలాను వంకాయ ధర ఇంత అని తెలిపే పట్టికలను సదరు నిర్వహకులు ఏర్పాటు చేస్తుంటారు. కేవలం రూ.30 నుంచి 50 పలికే టిఫిన్, కూరగాయల ధరలకు సంబంధించి వినియోగదారులకు స్పష్టమైన అవగాహన ఉండేందుకు వారు ఇటువంటి బోర్డులను ఏర్పాటు చేస్తుంటే… వేలు.. లక్షల్లో ధరలు పలికే వాహనాల షోరూం నిర్వాహకులు మాత్రం ఇటువంటి సదరు వాహనాల ధరలను తెలిపే డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయడం లేదు.

వాహనాల ధరలను డిస్‌ప్లే చేయడం ద్వారా ఏ వాహనం ధర, ఎంత ఉంది (ఎక్స్‌షోరూం ), సదరు వాహనానికి సంబంధించిన లైఫ్ ట్యాక్స్‌ను ఎంత చెల్లించాలి ? బీమా ఫీజును ఏ మేరకు చెల్లించాలి ? వాహన రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతి చెల్లించాలి తదితర వివరాలు సదరు వాహనదారులకు క్షుణ్ణంగా తెలియడమే కాకుండా సదరు వాహనాల కోనుగోలు విషయంలో హహనదారులు ఆచి తూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మోటారు వాహన చట్టం అనుసరించి వాహనా షోరూం నిర్వాహకులు తప్పకుండా వాహన ధరకు సంబంధించిన వివరాలను తప్పని సరిగా షోరూంల్లో డిస్‌ప్లే చేయాల్సిందే. కాని గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏ వాహన షోరూం (టూ వీలర్,ఫోర్ వీలర్) చూసినా ఇటువంటి తెలిపే బోర్డులు మచ్చుకైనా కనిపించవు.

సమర్‌నే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నూతన కారుకోనుగోలు నిమిత్తం షోరం నిర్వాహకులు సంప్రదించారు. సదరు షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు హనాలకు సంబంధించి చిన్న చిన్న అక్షరాలతో ( కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తాయి) ప్రైజ్‌లిస్టు వారి ముందు ఉంచి ఎక్స్‌షోరూం ప్రైజ్, లైఫ్‌ట్యాక్స్,ఇతర వివరాలను వారి తెలుపుతారు. దీంతో సమర్ కొంత అయోమయానికి లోనై తాను వారు ఏ వాహన వివరాలు తెలియక ఇబ్బంది పడ్డారు. ఇదేమిటని వారిని అడగ్గా పెన్ను ,పేపరుతో సదరు వాహనాలు వివరాలు రాసి ఇచ్చారు. డిస్‌ప్లే బోర్డు అంశంపై ప్రశ్నించగా ఆ అంశాన్ని దాటవేసి మీకు అర్దం కాకపోతే చెప్పండి సర్. మళ్ళీ చెబుతామని బదులు ఇచ్చారు. చేసేదేమీ లేక తిరిగి వచ్చారు.

డిస్‌ప్లే బొర్డు ఏర్పాటుతో అదనపు పు దోపిడికి చెక్: వాహన ఎక్స్ షోరూం ఫ్రైజ్ అనే వి రాష్ట్రాలను బట్టి ఎక్కువ ,తక్కువలు ఉండే అండే అవకాశం ఉంది. ఉదాహరణకు మారుతీ స్వఫ్ట్ ధర డిల్లీలో ఒక ధర ఉంటే హైదరాబాద్‌కు చేరేసరికి సదరు వాహన ఎక్స్ షోరూం ధర మరోలా ఉంటుంది. కాని ఇక్కడ నిర్వహకులు ఎక్స్‌షోరూం ప్రైజ్‌తో సంబంధం లేకుండా అదనంగా వసూలు చేసేందుకు అవకాశం ఉండదని డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు విషయంలో గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం వాహన ఎక్స్‌షోరూం ధరతో పాటు వాహన లైఫ్‌ట్యాక్స్ మించి ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయకూడదు. కాని నిర్వహకులు సదరు వాహన ఫోరూం నిర్వహకులు ఎక్స్‌షోరూం ,లైప్ ట్యాక్స్‌తో పాటు ఇతర చార్జీలను వాహనదారులు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News