వడోదర (గుజరాత్) : గుజరాత్ రాష్ట్రం లో రైలు రద్దు చేసిన తరువాత భారతీయ రైల్వే ఓ విద్యార్థికి కార్ రైడ్‌ను అందించిన ఘటన వడోదరలో తాజాగా వెలుగు చూసింది. భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసును రద్దు చేసిన నేపథ్యంలో ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు ఒక విద్యార్థి కోసం రైల్వే శాఖ అధికారులు కారులో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసి బంపర్ ఆఫర్ అందించారు. మద్రాస్ ఐఐటికి చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి సత్యం గద్వి ఏక్తానగర్ రైల్వేస్టేషన్ నుంచి వడోదర స్టేషన్‌కు రెండు గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. దీనికోసం అతను ఏక్తా నగర్ నుంచి పడోదరకు ప్రయాణించడానికి రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. వడోదర నుంచి సత్యం తన చివరి గమ్యస్థానం చెన్నైకి ప్రయాణం చేయాలి. అయితే భారీ వర్షాల కారణంగా ఏక్తానగర్ నుంచి పడోదరను కలిపే రైల్వే ట్రాక్‌లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రైలు సర్వీసును చివరిక్షణంలో రద్దు చేశారు. దీంతో చెన్నై వెళ్లే రైలును పట్టుకోడానికి రైల్వే అధికారులు విద్యార్థి సత్యంకు వడోదరకు తీసుకురాడానికి ప్రత్యేకంగా కారును అద్దెకు తీసుకుని సత్యంను వడోదరలో చెన్నై రైలులో సకాలంలో ఎక్కించ గలిగారు. ఈ విధంగా రైల్వే తనకు సాయం చేసినందుకు సత్యం అభినందనలు తెలిపారు.
ట్రయిన్ రద్దుతో విద్యార్థికి కారు రైడ్… రైల్వే బంపర్ ఆఫర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -