- Advertisement -
హైదరాబాద్: యువకుడు కారు అతివేగంగా నడపడంతో ట్యాంక్ బండ్ పై బోల్తాపడింది. శనివారం తెల్లవారుజామున టిఎస్ 08 ఇజడ్ 3990 అనే కారు అతివేగంగా వచ్చి ఎన్ టిఆర్ గార్డెన్ వద్ద బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడు గాంధీ ఆస్పత్రి నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కారును పక్కకు తొలగించారు.
- Advertisement -