Friday, November 22, 2024

కారు బానెట్ పై 5 కిలో మీటర్లు లాక్కెళ్లారు….

- Advertisement -
- Advertisement -

లక్నో: డిసిఎం డ్రైవర్‌ను కారు బానెట్‌పై ఐదు కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిసిఎం-కారు ఢీకొనడంతో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో డిసిఎం డ్రైవర్, కారులోని వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. కారును పక్కకు తీసుకొని వెళ్తుండగా డిసిఎం డ్రైవర్ ఆపాడు. కారును వేగంగా అతడిపైకి దూసుకరావడంతో కారు బానెట్‌పై వైపర్ పట్టుకొవడంతో ఐదు కిలో మీటర్లు లాక్కెళ్లారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News