Monday, December 23, 2024

కారు చోరీ చేశారు… కానీ స్టార్ట్ కాలేదు… ఏం చేశారంటే?

- Advertisement -
- Advertisement -

లక్నో: కారును అపహరించిన అనంతరం వాహనాన్ని 17 కిలో మీటర్లు నెట్టుకెళ్లిన సంగటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దబౌలి ప్రాంతంలో సత్యం కుమార్, అమన్ బిటెక్, అమిత్ అనే యువకులు త్వరగా ధనవంతులు కావాలని ఆశపడ్డారు. దీంతో వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 22న ఓ కారును దొంగతనం చేశారు. కారు స్టార్ట్ కాకపోవడంతో 17 కిలో మీటర్లు నెట్టుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో పార్కు చేసి అనంతరం మెకానిక్‌తో బాగుచేయించారు. బర్రా పోలీస్ స్టేషన్‌లో మారుతి కారు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తనిఖీల్లో కారును పట్టుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న మరో రెండు బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఆ మామిడిపండు ధర వింటే షాక్ అవుతారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News