Saturday, April 5, 2025

ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

అతివేగంగా కారు నడపడంతో అదుపు తప్పి భీభత్సం సృష్టించిన సంఘటన ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ అతివేగంగా రావడంతో ఎన్‌టిఆర్ ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి ఆగింది. కారు బలంగా ఢీకొట్టడంతో రెండు చెట్లు, విద్యుత్ స్తంభం ధ్వంసం అయింది. ప్రమాదం సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఫుట్‌పాత్‌పై ఉన్న కారును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా వాహనం ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు . కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కారు 120 కిలోమీటర్ల స్పీడు పైగానే కారు వచ్చి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. డివైడర్‌ను కారు ఢీకొన్న దృశ్యాలను చూసి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ధ్వంసమైన కారును పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News