Monday, January 20, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మద్యం తాగి కారు నడపడంతో కారు భీభత్సం సృష్టించిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడు మృతిచెందగా, ఇద్దరు యువకులకు గాలయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం…డిగ్రీ చదువుతున్న చంద్రశేఖర్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి అర్ధరాత్రి వరకు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కారులో బయలు దేరారు, మద్యం మత్తులో వేగంగా కారు డ్రైవ్ చేస్తు మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డుపై పడడంతో వెనుక నుంచి వచ్చిన కారు ఈ కారును ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్ మృతిచెందగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరు యువకులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులేనని పోలీసుల విచారణలో తెలిసింది. ముగ్గురు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News