Monday, December 23, 2024

నానక్‌రామ్‌గూడలో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలోని నానక్‌రాంగూడలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్నోవా క్రిస్టాకారును అతి వేగంగా నడపడంతో రోడ్డు పక్కన ఉన్న సైక్లింగ్ ట్రాక్‌పైకి కారు దూసుకెళ్లింది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. డ్రైవర్ అతి వేగం, నిర్లక్షం కారణంగానే కారు ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News