Sunday, January 5, 2025

ఎస్‌ఆర్ నగర్‌లో కారు భీభత్సం

- Advertisement -
- Advertisement -

కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బైక్‌లపైకి కారు దూసుకుని వెళ్లడంతో బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో టాటాపంచ్ కారు వస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అక్కడ ఉన్న షాపులోకి దూసుకుని వెళ్లింది. షాపు ముందు పార్కింగ్ చేసిన బైక్‌లపై నుంచి వెళ్లడంతో బైక్‌లు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News