Monday, January 20, 2025

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని  సనోధ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందు్కున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ ను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News