Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ లోని హనుమాన్‌ఘడ్ జిల్లాలో శనివారం రాత్రి ,ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బికనీర్ ఆస్పత్రికి తరలించారు. మెగాహైవేపై వీరు ప్రయాణిస్తున్న కారు లఖువాలీషేర్‌గఢ్ మధ్యలో ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పిల్లలతోసహా మొత్తం 9 మంది కారులో ఉన్నారు. వీరంతా నౌరంగ్‌డేసార్ గ్రామానికి చెందినవారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ్‌నగర్‌లో బర్త్‌డే ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు.

మృతులు పరమ్‌జీత్ కౌర్(60), ఖుష్‌వీందర్ సింగ్ (25),అతని భార్య పరమ్‌జీత్ కౌర్ (22), కొడుకు మంజోత్ సింగ్ (5), రామ్‌పాల్ (36), అతని భార్య రీనా(35), కుమార్తె రీత్(12)గా గుర్తించారు. పోస్ట్‌మార్టమ్ తరువాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీస్‌లు అప్పగించారు. ప్రమాదం జరిగిన తరువాత పరారైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ట్రక్కు రాంగ్ డైరెక్షన్‌లో ఓవర్‌టేక్ చేయడమే ప్రమాదానికి దారి తీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్‌లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News