Sunday, December 22, 2024

ఉన్నత చదువులకు ప్రయాణం..తండ్రి,కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా, కారేపల్లి మండలం, గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, తన కూతురు నూనావత్ అశ్విని (29) ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమాయిగూడెం వద్ద ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగింది. తండ్రి, కుమార్తెలు కలిసి ఆదివారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో బయలుదేరారు. ఆకేరు వాగులో తమ కారు నీట మునిగిందని, తమ మెడ వరకు నీళ్లు చేరాయని వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి తెలిపారు. అంతే.. ఆ తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు వారికి ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి.

దీంతో గ్రామస్థులు కొందరు హుటాహుటిన ఆకేరు వాగు వద్దకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుండి అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, రెండు కిలోమీటర్ల దూరంలోని పామాయిల్ తోటలో మధ్యాహ్నం సమయానికి డాక్టర్ ఆశ్విని మృతదేహం లభ్యమైంది. గల్లంతైన నూనావత్ మోతిలాల్ జాడ లభ్యం కాలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళుతున్న విద్యావంతురాలైన అశ్విని కారు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడంతో గంగారం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News