Thursday, January 23, 2025

వికారాబాద్ లో వాగులో కొట్టుకపోయిన కారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నయి. భారీ వరదను చూసుకోకుండా కారును దాటించే ప్రయత్నం డ్రైవర్ చేశాడు. కారు కొంత దూరం వరదలో కొట్టుకొనిపోయిన తరువాత చెట్టు వద్ద ఆగింది. కారు ఉన్న ఇద్దరు వ్యక్తులు చెట్టును పట్టుకొని బయటపడ్డారు. దేవనూరు శివ, ఆయ‌న‌ భార్య మౌనిక నాగారం సమీపంలోని వాగు దాటుతుండగా వరద ఉధృతికి కారు నీటిలో కొట్టుకుపోయింది. కారు నీటిలో కొట్టుకుపోతుండగా వారు చాక‌చ‌క్యంగా కారులో నుంచి బయట‌ప‌డ్డారు.  చెట్లను ఆస‌రాగా చేసుకుని గ‌ట్టుకు చేరుకున్నారు. వెంటనే కేకలు వేయడంతో అటుగా వచ్చిన వారి సహాయం కోరారు. నాగారం గ్రామానికి చెందిన కొందరు తాళ్ల సాయంతో వారిని బయటికి లాగారు.  దసరాకు పండుగ సందర్భంగా సొంతూరు దోర్నాల గ్రామానికి భార్యాభర్తలు శివ‌, మౌనిక వెళ్లారు. అనంతరం గురువారం ఉదయం తెల్లవారుజామున తిరిగి వెళుతుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నాగారం సమీపంలో ఉన్న‌ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారు వరదలో కొట్టుకొని పోయింది. దెవనూర్ శివ, ఆయ‌న భార్య మౌనిక ఇద్దరు కారులో నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News