Thursday, January 23, 2025

కారు గల్లంతు : వీడని ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

నంగునూరు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి మోయ తుమ్మెద పెద్ద వాగులో వరద ఉదృతికి కారు వాగులో గల్లంతయినట్లు స్ధానికులు తెలిపిన ఘటనలో ఇంకా ఉత్కంఘ కొనసాగుతూనే ఉంది. అక్కెనపల్లి వాగులో శుక్రవారం రాత్రి కారు గల్లంతయినట్లు స్ధానికుల సమాచారంతో శనివారం ఉదయం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట ఏసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అక్కెనపల్లి వాగు కాజ్‌వే నుండి పోరెడ్డి పల్లి వంతెన వరకు సుమారు రెండు కిలో మీటర్ల మేర డ్రోన్ కెమెరాలతో, గజ ఈతగాళ్లు వాగును జల్లెడ పడుతున్నారు. వాగులో వరద ఉదృతి అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. అయినప్పటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కెనపల్లి వాగులో కారు గల్లంతయిన ఘటనలో కారు గల్లంతయ్యిందా లేదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News